Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూటింగు పూర్తిచేసుకున్న 'యశోద'

Yashoda Movie Update
  • సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'యశోద'
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ 
  • హరి - హరీశ్ ద్వయం దర్శకత్వం 
  • త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
సమంత ప్రధాన పాత్రధారిగా 'యశోద' సినిమా రూపొందింది. టైటిల్ ను ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి హరి - హరీశ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. 

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొంతసేపటి క్రితం సమంత పోస్టర్ ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ .. ఉన్ని ముకుందన్ .. రావు రమేశ్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ ను త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు. 'యూ టర్న్' .. 'ఓ బేబీ' వంటి హిట్స్ తరువాత సమంత చేసిన సినిమా ఇది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేసిన 'శాకుంతలం' సినిమా కూడా విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే.
Samantha
Rao Ramesh
Varalakshmi Sharath Kumar

More Telugu News